JrNTR Latest Movie Jailavakusa Review | JrNTR | Nivetha Thomas | Rashi Khanna | Nandamuri KalyanRam | NTR Arts | DevisriPrasad |
JrNTR Latest Movie Jailavakusa Review:
Cast and Crew:
Starring : JrNTR,Nivetha Thomas,Rashi Khanna
Director: K S Ravindra (Bobby)
Producer:Nandamuri KalyanRa
Banner: NTR Arts
Muci By : Devisri Prasad
Cinematography : Chota K Nayudu
Written by : Kona Venkat,Ks Ravindra ,K Chakravarthy
Edited By : Kotagiri Venkateswarao
జై లవకుశ (JaiLavakusa):
జూనియర్ ఎన్టీఆర్ ,దర్శకుడు బాబి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం జై లవకుశ ఈ సినిమా పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి దానికి కారణం కూడా లేకపోలేదు ఈ సినిమా లో తారక్ త్రిపాత్రభినయం చేయనున్నాడు అంటే తారక్ ఈ సినిమా లో 3 పాత్రల్లో కనిపిస్తున్నాడు అందులో మొదటి పాత్ర జై ,రెండవ పాత్ర లవకుమార్ ,మూడవ పాత్ర కుశ అనే మూడు పాత్రలతో తారక్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనున్నాడు . ఈ సినిమా లో తారక్ కి జోడీగా నివేత థామస్ ,రాశి ఖాన్న లు నటించారు. తారక్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా న్ని తెరకెక్కించాడు.అయితే సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ తరువాత కూడా బాబీ నే దర్శకుడి తీసుకోవటం పై అనుమానాలు లేకపోలేదు బాబీ కథను నమ్మి తారక్ అవకాసం . జై లవకుశ సినిమా దసరా కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఇచ్చాడు మరి ఈ సినిమా అన్ని రికార్డు లను తిరగ రాస్తుంది అని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.మరి బాబీ ఈ అంచనాలను చేరుకున్నదా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ (Story):
ఒక తల్లికి ముగ్గురు కవలలు పుడతారు వారె జై ,లవ కుమార్,కుశ ముగ్గురు ఎప్పుడూ కలసి ఉండాలన్నదే తల్లి ఆశ కాని ప్రమాద సాత్తు వీరి ముగ్గురు చిన్నప్పుడే విడిపోతారు. ఆ తరువాత ఈ ముగ్గురు పెరిగి పెద్దవుతారు జై ఉత్తర ప్రదేశ్ లో పేరే మోసిన రౌడి గా తయారవుతాడు. ,లవ కష్ట పడి చిన్న బ్యాంకు లో ఉద్యోగం సంపాదిస్తాడు ,కుశ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఫారిన్ వెళ్లి అక్కడ సెటిల్ అవ్వటం కోసం ప్రయత్నిస్తాడు .కాని అనుకోకుండా వీరిద్దరి జీవితాల్లోకి జై ప్రవేసిస్తాడు ఆ తరువాత ఏమైంది ముగ్గురు కలుసుకున్నారా లేదా అనే కొన్ని ఆసక్తి కారమైనా విషయాలను తెలుసుకోవాలంటే జై లవకుశ సినిమా చూడాల్సిందే .
రివ్యూ (Review):
జై లవకుశ అనే మూడు పాత్రల్లో ఎన్టీఆర్ అద్బుత నటన చేసాడు దీనికి తోడూ తారక్ డాన్స్ లు కొన్ని యాక్షన్ సీన్స్ సినిమా కి హై లెట్ అనే చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతాని దుమ్ము లేపే రేంజ్ లో ఇచ్చాడు. ఇక నివేత థామస్ ,రాశి ఖాన్న ల విషయానికి వస్తే తన అందచందాలతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నారు వీరి కనిపించేది తక్కువే అయినా ఉన్నంత సేపు ఎంటర్ టై చేస్తారు.చోట కే నాయుడు కెమెరా పని తీరు అద్భుతం ఇక సినిమా లో కి వస్తే జై యాక్షన్ సీన్స్ తో మై మరపిస్తే ,లవ ,కుశ లు కామెడి లతో ఎంటర్ టైన్ చేసి సినిమా ని ముందుకు నడిపిస్తారు. కథ పాతదే అయినా బాబీ తన డైరెక్షన్ లో మాత్రం తన సత్తాని చాటుకున్నాడు .మొత్తానికి జై లవకుశ తన పై ఉన్న అంచనాలను రీచ్ అయింది అనే చెప్పాలి . ఫైనల్ గా ఇదో ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్ టైనర్ గా తారక్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అనే చెప్పాలి.
రేటింగ్ (Rating):
ఆడియో లాంచ్ రేటింగ్ :3.3 /5
Jailavakusa Theaterical Trail Watch Here: